Thursday, March 22, 2007

గ్రామీణ ఉపాధి హామీ పధకపు మేడిపండు స్వభావం.

గ్రామీణ ఉపాధి హామీ పధకపు మేడిపండు స్వభావం.
గత సంవత్సరం ఫిబ్రవరి 2న ప్రధాని మన్మోహన్, జా.స.మం.అధ్యక్షురాలు సోనియాగాంధీ అనంతపురం జిల్లాలో ఐదుగురు గ్రామీణ కూలీలకు " జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకపు ఉద్యొగపు కార్డులను" ఇవ్వడం ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు ప్రారంభమైంది.
పేదలలోని నిరుపేదలకు జీవనోపాధి భద్రతను కల్పించడం కోసం, గ్రామీణ పేదల దౌర్భాగ్యాన్ని తగ్గించడం కోసం, జీవనోపాధి నిమిత్తం గ్రామీణ పేదలు ఇతరప్రాంతాలకు వలసపోవడాన్ని తగ్గించడంకోసం , దారిద్ర్య బాధనుంచి ఉపశమనం కలుగజేసి దారిద్రాన్ని పారద్రోలడం కోసం, వారు వ్యాధుల బారిన పడకుండావుండడంకోసం, ఈపధకం తోడ్పడడంతోపాటు ఆప్రాంత మౌలిక వసతులైన స్కూళ్ళు , రోడ్లు , నీటిసరఫరా నిర్మాణాలు ఏర్పరచడానికి దోహదపడుతుందని విధానకర్తలు ప్రకటించారు. దేశంలో ఈపధకం 200ల జిల్లాలలో అమలుజరపడంమొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది.2006-07 లో బడ్జట్ లో 10000కోట్లు కేటాయించి 6714.2 కోట్లను విడుదల చేసింది. అంటే 67%. దేసంలో మెత్తం 600 జిల్లాలకుగాను 200 జిల్లాలకే ఇది పరిమెతమైనది అంటే 33 శాతమేనన్నమాట. ఈ 200 జిల్లాలలో 5 కొట్ల 40 లక్షల పేద కుటుంబాలు ఉన్నాయి. వీటిలో 26% అత్యంత నివుపేద కుటుంబాలు . కాని ప్రభుత్వము 3కోట్ల 34 లక్షల కుటుంబాలు రిజిస్టరు చేయబడినట్లు చెబుతుంది.దీని ప్రకారం 60%నివుపేద కుటుంబాలు వున్నాయన్నమాట. వారిలెక్కలప్రకారమే వొక్కో కుటుంబానికి వొకసంవత్సరకాలంలో 14 రోజులుమాత్రమే పనికల్పించబడిందన్నమాట. అంటే సంవత్సరానికి వొకకుతుంబానికి 800 రూపాయలు చెల్లించడంద్వారా పేదరికము నుండి తప్పించినట్లన్నమాట.అంటే ఎంత ఘోరంగావిఫలమయ్యారో చూడండి.

No comments: